జనావాసాల మధ్య విచ్చల విడిగా బెల్టు షాపులు
ఇబ్బందులు ఎదుర్కొంటున్న కాలనీవాసులు మామూళ్ల మత్తులో ఎక్సైజ్ శాఖ అధికారులు రుద్రూర్, బతుకమ్మ : గ్రామాలల్లో జనావాసాల మధ్య విచ్చల విడిగా బెల్టు షాపులు వెలిశాయి. మద్యం సేవించిన మద్యం ప్రియులు గొడవలకు పాల్పడడంతో కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రుద్రూర్ మండల కేంద్రంలోని అన్ని గ్రామాలలో జనావాసాల మధ్య పుట్ట గొడుగుల్లా బెల్టు షాపులు వెలిశాయి. జనావాసాల మధ్యనే బెల్టు షాపు దందాకు ఆజ్యం పోస్తూ గుడి, బడి అనే తేడా లేకుండా మద్యం అక్రమ విక్రయాలు జోరుగా సాగిస్తున్నారు....