Batukammanews
Newspaper Banner
Date of Publish : 15 May 2025, 6:41 pm Posted by : ramakrishna

జనావాసాల మధ్య విచ్చల విడిగా బెల్టు షాపులు

  • ఇబ్బందులు ఎదుర్కొంటున్న కాలనీవాసులు
  • మామూళ్ల మత్తులో ఎక్సైజ్ శాఖ అధికారులు

 

రుద్రూర్, బతుకమ్మ : గ్రామాలల్లో జనావాసాల మధ్య విచ్చల విడిగా బెల్టు షాపులు వెలిశాయి. మద్యం సేవించిన మద్యం ప్రియులు గొడవలకు పాల్పడడంతో కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రుద్రూర్ మండల కేంద్రంలోని అన్ని గ్రామాలలో జనావాసాల మధ్య పుట్ట గొడుగుల్లా బెల్టు షాపులు వెలిశాయి. జనావాసాల మధ్యనే బెల్టు షాపు దందాకు ఆజ్యం పోస్తూ గుడి, బడి అనే తేడా లేకుండా మద్యం అక్రమ విక్రయాలు జోరుగా సాగిస్తున్నారు. మద్యం షాపులు సిండికేట్ గా ఏర్పడి వ్యాపారుల లాభాల కోసం వేట మొదలెట్టి బెల్ట్ దందాను ప్రోత్సహించి, ఏజెన్సీ ప్రాంతంలోని ప్రజల కష్టాన్ని సొమ్ము చేసుకుంటూ మద్యం కోట్లు గడిస్తున్నారు. ఆబ్కారీ శాఖ లిక్కర్ వ్యాపారులకు కొమ్ము కాస్తూ నిబంధనలు ఉల్లంఘిస్తు మామూళ్ళ మత్తులో మునిగి తేలుతున్నారనే ఆరోపణలు   వెలువెత్తుతున్నాయి. రుద్రూర్ గ్రామంలోని జేయన్సీ కాలనీలో ప్రభుత్వ పాఠశాల వెనుకాల ఓ వ్యక్తి తన ఇంట్లోనే జనావాసాల మధ్య బెల్టు షాపు దాందాను జోరుగా కొనసాగిస్తున్నారు. ఇక్కడి నుండి బెల్టు షాపును తీసివేయాలని బిజెపి నాయకులు, కాలనీవాసులు పలుమార్లు విన్నవించిన అవేమీ పట్టనట్లుగా యదేచ్చగా బెల్టు షాపును కొనసాగిస్తున్నారు. ఈ బెల్టు షాపు వలన ప్రతి రోజు మద్యం ప్రియులు మద్యం సేవించి గొడవలకు దారితీస్తున్నారని, దింతో కాలనీవాసులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు. ఇప్పటికైనా ఎక్సైజ్ శాఖ అధికారులు వెంటనే స్పందించి  జనావాసాల మధ్య బెల్టు షాపులను తొలగించే విధంగా చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు.