Batukammanews
Newspaper Banner
Date of Publish : 05 May 2025, 12:53 pm Posted by : ramakrishna

బీజేపీ వేల్పూర్ అధ్యక్షుడిగా బేల్దారి నవీన్

వేల్పూర్, బతుకమ్మ: భారతీయ జనతా పార్టీ (బీజేపీ) మండల అధ్యక్షుడిగా బేల్దారి నవీన్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా నవీన్ మాట్లాడుతూ.. తన పై నమ్మకంతో పార్టీ మండల బాధ్యతలు అప్పగించిన ఎంపీ ధర్మపురి అర్వింద్, జిల్లా అధ్యక్షుడు దినేశ్ కులచారి పటేల్, బాల్కొండ మాజీ శాసన సభ్యురాలు అన్నపూర్ణమ్మతోపాటు రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, నియోజకవర్గ ఇన్ చార్జి ఏలేటి మల్లికార్జున్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే తన నియామకానికి సహకరించిన బాల్కొండ కన్వీనర్ మల్కన మోహన్, జిల్లా సెక్రెటరీ నరసింహారెడ్డి , మండల మాజీ అధ్యక్షుడు ఏలేటి రమేశ్ రెడ్డితోపాటు సహకరించిన అన్ని గ్రామాల బూత్ అధ్యక్షులకు, కార్యకర్తలకు, శక్తి కేంద్ర ఇన్ చార్జీలకు, అభిమానులకు, ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. గతంలో మండల ఉపాధ్యక్షుడిగా పనిచేశానని, తనపై నమ్మకంతో అప్పగించిన బాధ్యతలను పక్కాగా నిర్వర్తిస్తానని అన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ విజయం కోసం నాయకులు, కార్యకర్తలను కలుపుకుని ముందుకు వెళ్లి పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేస్తానని అన్నారు.