రుద్రూర్, బతుకమ్మ :
రుద్రూర్ మండల కేంద్రంలో పశుమాంసం మార్కెట్ వద్ద అపరిశుభ్రమైన పశుమాంసం విక్రయాలు చేస్తున్నారని వెంటనే విక్రయాలను నిలిపివేయాలని మజీద్ సదర్ లు సోమవారం తహసీల్దార్ తారాబాయి కి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. పశుమాంసం మార్కెట్ వద్ద డాక్టర్ సర్టిఫికేట్ లేకుండా అపరిశుభ్రమైన పశుమాంసాన్ని విక్రయించి ప్రజల ఆరోగ్యలతో చెలగాటమాడుతున్నారని పేర్కొన్నారు. పశుమార్కెట్ (కమేళ) నందు కుక్కలు, పందులు సంచరిస్తు బల్లల పైన నాకడం వాటిపైనే మాంసం పెట్టి విచ్ఛల విడిగా పెద్ద ఎత్తున విక్రయాలు జరుపుతున్నారని, దీనివలన దుర్వాసన వెదజల్లి ప్రజలు అనారోగ్యాల పాలవుతున్నార ని అన్నారు. కావున పశుమాంసం విక్రయిస్తున్న వారిపై తగు చర్యలు తీసుకోని, విక్రయాలను నిలిపివేయాలని వినతి పత్రంలో పేర్కొన్నారు. వినతిపత్రం అందించిన వారిలో మజీద్ సదర్ లు, పెద్దలు, గ్రామస్తులు పాల్గొన్నారు.