Batukammanews
Newspaper Banner
Date of Publish : 08 November 2024, 9:06 pm Posted by : ramakrishna

బీడీ కార్మికులకు  రూ.4,016  జీవన భృతి ఇవ్వాలి 

బతుకమ్మ, జుక్కల్ :- కాంగ్రెస్ ప్రభుత్వం గత అసెంబ్లీ ఎన్నికలలో బీడీ కార్మికులందరికీ జీవన భృతి . 4వేల 16 రూపాయలు ఇస్తామన్న హామీ ప్రకారం ఎలాంటి షరతులు లేకుండా ప్రతి ఒక్కరికి జీవన భృతి ఇవ్వాలనిసిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు సురేష్ గొండ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం 2022 సంవత్సరం ఫిబ్రవరి28 గ కటప్ తేదీని తొలగించి బీడీ పరిశ్రామాలో పనిచేస్తు పీఎఫ్ కలిగిన వారు జీవన భృతి కొరకు మీ సేవలలో దరఖాస్తు చేసుకోవాలని చెప్పిన గత ప్రభుత్వం జీవన భృతి కల్పించలేకపోయింది. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలలో బీడీ కార్మికులందరికీ పిఎఫ్. కలిగి ఉన్న వారందరికీ జీవనభృతి ఇస్తామని హామీ ఇచ్చి ఇచ్చిన హామీని నేటికీ అమలు చేయకపోవడం కార్మికుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం చిన్న చూపు చూడడం సరైంది కాదని ప్రభుత్వ తిరుపై ఆయన మండిపడ్డారు. ఇప్పటికైనా జుక్కల్ నియోజకవర్గంలోని పిఎఫ్ కలిగి ఉన్న ప్రతి బీడీ కార్మికులందరికీ జీవన భృతి ఇప్పించే విధంగా జుక్కల్ నియోజకవర్గ ఎమ్మెల్యే కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. జుక్కల్ నియోజకవర్గం లోని బీడీ కార్మికులందరికీ ఇండ్ల స్థలాలు ఇస్తామని చెప్పిన మాజీ ఎమ్మెల్యే  ఇవ్వలేకపోయారు ఇప్పటికైనా ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు జుక్కల్ నియోజకవర్గంలోని బీడీ కార్మికులందరికీఇండ్ల స్థలాలు, డబల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరు చేయాలని సిపిఎం పార్టీజిల్లా కమిటీ సభ్యుడు సురేష్ గొండ ఎమ్మెల్యే కు విజ్ఞప్తి చేశారు.