Batukammanews
Newspaper Banner
Date of Publish : 07 March 2025, 5:14 pm Posted by : ramakrishna

అరగంట ముందే బీఎడ్ మొదటి సెమిస్టర్ పేపర్ లీక్

వెబ్ డెస్క్, బతుకమ్మ : నాగార్జున వర్సిటీ పరిధిలో బీఎడ్ మొదటి సెమిస్టర్ పరీక్షలు ఈ మధ్యాహ్నం 2 గంటలకు ప్రాస్పెక్టివ్స్ ఇన్ చైల్డ్ డెవలప్ మెంట్ పరీక్ష పరీక్ష ప్రారంభానికి అరగంట ముందే పేపర్ లీక్ అయింది. బీఎడ్ మొదటి సెమిస్టర్ కు సంబంధించి శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రాస్పెక్టివ్స్ ఇన్ చైల్డ్ డెవలప్ మెంట్ పరీక్ష జరగాల్సి ఉండగా… పరీక్ష ప్రారంభానికి అరగంట ముందే పేపర్ లీక్ అయింది. కాలేజీల యాజమాన్యాలే పేపర్ లీక్ చేసినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే, దీనిపై ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పీజీ పరీక్షల కోఆర్డినేటర్ ప్రొఫెసర్ సుబ్బారావును మీడియా వివరణ కోరగా… పరీక్ష ప్రారంభానికి 30 నిమిషాల ముందు సీడీ ద్వారా పేపర్ రిలీజ్ చేశారని, అది బయటికి ఎలా లీకైందో తెలియదని బదులిచ్చారు. కాగా, గురువారం జరిగిన పరీక్షలోనూ క్వశ్చన్ పేపర్ అరగంట ముందే బయటికి వచ్చినట్టు తెలుస్తోంది.