. . . అడవిలో కట్టెల కోసం వెళ్లిన వ్యక్తిపై దాడి
. . . చికిత్స పొందుతున్న బాధితుడు
కామారెడ్డి, బతుకమ్మ :
కామారెడ్డి మండలం రెడ్డి పేట స్కూల్ తండాకు చెందిన సలావత్ మత్తు(45) అనే వ్యక్తిపై ఎలుగుబంటి దాడికి పాల్పడింది. అడవిలో కట్టెల కోసం వెళ్లిన సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మత్తు ముఖంపై ఎలుబంటి బలమైన గాయాలు చేయడంతో భార్య, స్థానికులు కేకలు వేయడంతో అక్కడి నుండి ఎలుగుంటి పారిపోయింది. తీవ్ర గాయాలైన బాధితుడిని కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం మత్తు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. దీంతో రెడ్డిపేట్ గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. అటవీ ప్రాంతానికి వెళ్లేవారు అప్రమత్తంగా ఉండాలని మాచారెడ్డి ఎఫ్ఆర్ వో గ్రామస్తులకు సూచించారు.