Batukammanews
Newspaper Banner
Date of Publish : 26 May 2026, 5:53 pm Posted by : ramakrishna

అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తతతో ఉండాలి

 

. . . లీగల్ చీఫ్ డిఫెన్స్ కౌన్సిల్ రాజ్ కుమార్ సుబేదార్

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

చిన్నారులు అనుమానస్పద వ్యక్తుల వ్యవహార శైలి పట్ల అప్రమత్తత తో ఉండాలని, అపరిచిత వ్యక్తుల ప్రలోభాలకు లొంగకూడదని లీగల్ చీఫ్ డిఫెన్స్ కౌన్సిల్ రాజ్ కుమార్ సుబేదార్ అన్నారు. నగరంలోని గంగస్తాన్ లో గల వివేకానంద ఆడిటోరియంలో రామ కృష్ణ సేవ సమితి ఆధ్వర్యంలో జరుగుతున్న వివేక్ సంస్కార్ వేసవి శిక్షణ శిబిరంలో విద్యార్థులకు మంగళవారం జిల్లా న్యాయ అధికార సేవ సంస్థ నిర్వహించిన బాలల చట్టాల పై అవగాహన  కలిగించారు. ఈ సందర్భంగా సుబేదార్ మాట్లాడుతూ బాల బాలికలు మానవ శరీరం మీద గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అవగాహనతో ఉండాలని అన్నారు. మైనర్ పిల్లలు వేధింపులకు గురి అయినప్పుడు నిందితుల పట్ల పోక్సో చట్ట ప్రకారం కఠిన చర్యలు ఉంటాయని, సెల్ ఫోన్ విచిత్రికలలో అప్రమత్తతో ఉండాలని, పిల్లలు తల్లిదండ్రుల పర్యవేక్షణలో ఉండాలని తెలిపారు. విపత్కర పరిస్థితుల్లో గుండె ధైర్యంతో ముందుకు సాగాలని పేర్కొన్నారు. బార్ అసోసియన్ మాజీ అధ్యక్షుడు జగన్మోహన్ గౌడ్ మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థలో నైతిక విలువలు తో విద్యార్థులు ఉన్నతమైన లక్ష్యంతో ముందుకు సాగాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పానెల్ అడ్వకేట్ రంజీత్ సుతారే, ఫారా లీగల్ వాలంటీర్ జీవన్, రామకృష్ణ సేవా సమితి అధ్యక్షులు సాయిప్రసాద్, సంస్థ ప్రతినిధి గోపాల్, దేరీన్ వసంత్, గంగాధర్ కిశోర్, న్యాయసేవ సంస్థ ప్రతినిధి నాగేందర్ తదితరులు పాల్గొన్నారు.

 

Be wary of strangers.