Batukammanews
Newspaper Banner
Date of Publish : 03 December 2025, 7:43 pm Posted by : ramakrishna

అంతరాష్ట్ర సరిహద్దు వద్ద అప్రమత్తంగా ఉండాలి

 

 ఆబ్కారీ  శాఖ ఈ ఎస్ హన్మంత్ రావు

మద్నూర్, బతుకమ్మ:

అంతర్ రాష్ట్ర సరిహద్దు వద్ద ఎక్సైజ్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని కామారెడ్డి జిల్లా ఆబ్కారీ శాఖ సూపరింటెండెంట్ హన్మంత్ రావు అన్నారు. మద్నూర్ మండలం సలాబత్ పూర్ వద్ద బుధవారం జాతీయ రహదారిపై ఉన్న ఆబ్కారీ చెక్ పోస్ట్ ను  ఎక్సైజ్ ఈ ఎస్ తనిఖీ చేశారు. గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఇతర రాష్ట్రాల నుంచి నగదు, మద్యం అక్రమంగా రవాణా జరగకుండా గట్టి చర్యలు తీసుకోవాలని సూచించారు. పలు వాహనాలను ఆయనే స్వయంగా తనిఖీలు చేపట్టారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఏర్పాటు చేసిన చెక్ పోస్టును పరిశీలించారు. ఆయనతో పాటు ఆ శాఖ చెక్ పోస్ట్ సీఐ జావిద్, రెవెన్యూ, పోలీసు అధికారులు ఉన్నారు.