సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి

స్పెషల్ ఆఫీసర్ రాజీవ్ గాంధీ హనుమంతు   కామారెడ్డి, బతుకమ్మ : సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని స్పెషల్ ఆఫీసర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆదేశించారు.  కామారెడ్డి జిల్లాకు ప్రత్యేక అధికారిగా నియమించబడిన రాజీవ్ హనుమంతు  ఈరోజు జిల్లా పర్యటనలో భాగంగా బిక్నూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. ఆరోగ్య కేంద్రంలో అందుతున్న సేవల గురించి వైద్యులు వైద్య సిబ్బంది పనితీరు గురించి రాజీవ్ హనుమంతు సమీక్షించారు. ఆసుపత్రిలో ఉన్న వివిధ విభాగాలను ప్రత్యక్షంగా పర్యవేక్షించారు. ఆసుపత్రిలో గల ఇన్ పేషెంట్ వార్డు...