Batukammanews
Newspaper Banner
Date of Publish : 08 July 2025, 7:07 pm Posted by : ramakrishna

సీజనల్ వ్యాధులపై  అప్రమత్తంగా ఉండాలి

  • జిల్లా మలేరియా అధికారి డాక్టర్ తుకారం రాథోడ్

 

బతుకమ్మ, కోటగిరి :  సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని  జిల్లా మలేరియా అధికారి డాక్టర్. తుకారం రాథోడ్ సూచించారు. కోటగిరి మండల కేంద్రంలోని రెండు పాజిటివ్ కేసులు నమోదు కానీ వారిని  మంగళవారం ఆయన విజిట్ చేశారు.అనంతరం  మండల కేంద్రంలోని మీర్జాపూర్ ఆరోగ్య ఉపకేంద్రం పరిశీలించి గ్రామ పంచాయతీ కార్యాలయం సందర్శించి గ్రామ పంచాయతీ సెక్రెటరీ తో పరిసరాల పరిశుభ్రత, లార్వా సర్వే, మురికి కాలువల పైన, నీటి నిలువల పైన స్ప్రే, ఫాగింగ్ తదితర విషయాల చర్చించి  పలు సూచనలు  అందించారు. అనంతరం పి హెచ్ సి పోతంగల్ లో వైద్య శాఖ సిబ్బందితో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ… అన్ని వేళలా  ఆశ కార్యకర్తలు, ఆరోగ్య కార్యకర్తలు అందరు క్షేత్ర స్థాయిలో అప్రమత్తంగా ఉండాలని సీసనల్ వ్యాధుల పైన ఎటువంటి నిర్లక్ష్యం చేయరాదు, ప్రతి రోజు సర్వే సక్రమంగా చేయాలని, డెంగీ అదుపునకు గ్రామాలలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలియ చేశారు, ఫ్రైడే డ్రై డే పైన ప్రజలకు పూర్తి స్థాయిలో అవగాహనా కలిగించాలని మరియు స్కూల్స్,హాస్టల్లో అవగాహనా సదస్సు లు నిత్యం నిర్వహించడం ద్వారా అందరికి అవగాహనా కలిగించాలని తెలియ చేశారు ఈ కార్యక్రమం నందు సబ్ యూనిట్ అధికారి గోవర్ధన్, స్థానిక సూపర్ వైసర్ సునీతా, స్థానిక ఆరోగ్య కార్యకర్త లలిత, ఆశ కార్యకర్తలు, సిబ్బంది పాల్గొన్నారు.

Be vigilant about seasonal diseases