- కామారెడ్డి పోలీస్ కళాబృందం చే అవగాహన సదస్సు
బతుకమ్మ భిక్కనూరు: నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని భిక్కనూరు ఎస్సై ఆంజనేయులు కోరారు. మంగళవారం సైబర్ నేరాలపై జిల్లా ఎస్పి రాజేష్ చంద్ర ఆదేశాల మేరకు భిక్కనూరు మండలంలోని జంగంపల్లి గ్రామంలో ఉన్న కేజీబీవీ బాలికల విద్యాలయం నందు పోలీస్ కళాబృందంతో అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కళాబృందం సభ్యులు విద్యార్థులు అపరిచిత వ్యక్తులతో సోషల్ మీడియా నందు జాగ్రత్తగా ఉండాలని, సైబర్ క్రైమ్ గురించి షీ టీం నెంబర్ 8712686094 కాల్ చేయాలన్నారు. సైబర్ నేరాల పట్ల టోల్ ఫ్రీ నెంబర్ 1930కు కాల్ చేసి అత్యవసర పరిస్థితుల్లో100,108,180 నంబర్లను వినియోగించుకోవాలని ప్రతి మహిళ ఫోన్ నందు T-safe app డౌన్లోడ్ చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి పోలీస్ కళాబృందం, భిక్కనూరు పోలీస్ హెడ్ కానిస్టేబుల్ నరేందర్ రెడ్డి, రవి, రమేష్, రఘుపతి రెడ్డి, ఎల్లయ్య స్కూల్ ఉపాధ్యాయులు ఉన్నారు.
