Batukammanews
Newspaper Banner
Date of Publish : 23 April 2026, 7:20 pm Posted by : ramakrishna

సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి

 

రుద్రూర్, బతుకమ్మ :

 

సైబర్ నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. రుద్రూర్ మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ వద్ద గురువారం పోలీసులు సైబర్ నేరాల పై ప్రజలకు అవగాన కల్పించారు. అపరిచిత లింక్‌లను క్లిక్ చేయకపోవడం, వ్యక్తిగత సమాచారం (ఓటిపి, పిన్) ఎవరికీ చెప్పకపోవడం ద్వారా మోసాలను అరికట్టవచ్చుని సూచించారు. నకిలీ లోన్ యాప్స్, పెట్టుబడి పథకాల పట్ల జాగ్రత్తగా ఉండాలన్నారు. ఎటువంటి అనుమానాస్పద లావాదేవీలు జరిగినా వెంటనే 1930 నంబర్‌కు లేదా స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కానిస్టేబుల్ గౌతమి, గజేందర్, యువకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.