Batukammanews
Newspaper Banner
Date of Publish : 29 July 2025, 5:57 pm Posted by : ramakrishna

సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి

బాల్కొండ, బతుకమ్మ : ప్రతి ఒక్కరూ సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని బాల్కొండ ఎస్సై శైలేందర్ అన్నారు. బాల్కొండ మండల కేంద్రానికి చెందిన సత్యసాగర్ ను గత నెల 26న అమెజాన్ డెలివరీ ఏర్పాటు చేస్తామని నమ్మించి మోసం చేశారని ఆయన పేర్కొన్నారు. సత్య సాగర్ పలు దఫలుగా రూపాయలు 171690 చెల్లించాడని మళ్లీ డబ్బులు అడగడంతో మోసపోయినట్లు గ్రహించాడు. దీంతో బాధితుడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు ఎస్సై తెలిపారు.