ప్రజలతో మరింత స్నేహ పూర్వకంగా వ్యవహరించాలి

  . . . నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య   మోపాల్, బతుకమ్మ :   పోలీస్ సిబ్బంది ప్రజలతో మరింత స్నేహపూర్వకంగా వ్యవహరించాలని, ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య అన్నారు. నిజామాబాద్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఆయన శుక్రవారం మోపాల్ పోలీస్ స్టేషన్‌ను పర్యవేక్షించారు.  ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్‌లోని రికార్డుల నిర్వహణ, ఫిర్యాదుల పరిష్కారం, భద్రతా చర్యలు, సిబ్బంది పనితీరును సమీక్షించారు.  ...