Batukammanews
Newspaper Banner
Date of Publish : 20 March 2026, 5:22 pm Posted by : ramakrishna

ప్రజలతో మరింత స్నేహ పూర్వకంగా వ్యవహరించాలి

 

. . . నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య

 

మోపాల్, బతుకమ్మ :

 

పోలీస్ సిబ్బంది ప్రజలతో మరింత స్నేహపూర్వకంగా వ్యవహరించాలని, ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య అన్నారు. నిజామాబాద్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఆయన శుక్రవారం మోపాల్ పోలీస్ స్టేషన్‌ను పర్యవేక్షించారు.  ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్‌లోని రికార్డుల నిర్వహణ, ఫిర్యాదుల పరిష్కారం, భద్రతా చర్యలు, సిబ్బంది పనితీరును సమీక్షించారు.

 

Be more friendly with people.

 

అలాగే శాంతి భద్రతలను కట్టుదిట్టంగా నిర్వహిస్తూ, ప్రజల విశ్వాసాన్ని పెంపొందించే విధంగా పని చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమం ద్వారా పోలీస్ శాఖ పనితీరును మెరుగుపరచడం, ప్రజలకు మెరుగైన సేవలు అందించడం లక్ష్యంగా ఉందని తెలిపారు. పోలీస్ స్టేషన్ కు సంబంధించినటువంటి బొలెరో వాహనం, పెట్రోలింగ్ వాహనంల పనితీరును క్షుణ్ణంగా తనిఖీ నిర్వహించారు.

 

Be more friendly with people.

 

పెట్రోలింగ్ వాహనంలో ఏర్పాటు చేసినటు వంటి ఫస్ట్ ఎయిడ్ కిట్ సామాగ్రి తనిఖీ చేసి, ఎల్లప్పుడూ కండిషన్ లో ఉంచుకోవాలని తెలిపారు. ఆ కార్యక్రమంలో నిజామాబాద్ సౌత్ రూరల్ ఇన్స్ పెక్టర్ ఎన్. సురేష్ కుమార్, ఎస్సై జెడ్. సుస్మిత, పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.

 

Be more friendly with people.