ఆ దగ్గు సిరప్ తో జాగ్రత్త.. వెంటనే ఆపేయండి

ప్రజలకు తెలంగాణ సర్కార్ కీలక హెచ్చరిక   బతుకమ్మ, బిచ్కుంద : పిల్లల్లో దగ్గు తగ్గించడానికి కోల్డ్రిఫ్ సిరప్ వాడకూడదని ప్రజల్ని రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ చేసింది. ఈ మందులో పారాసిటమాల్, ఫినైల్‌ఫ్రైన్ హైడ్రోక్లోరైడ్, క్లోర్‌ఫెనిరమిన్ మలేట్ వంటి మిశ్రమాలు ఉన్నాయి. ఇటీవల మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లో ఈ దగ్గు మందు తాగి చాలా మంది చిన్నారులు మరణించారు. ఈ ఘటనలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. పిల్లలకు దగ్గు మందులు సూచించిన ఒక వైద్యుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. పిల్లలకు ఏ మందులు ఇవ్వాలో వైద్యుల...