Batukammanews
Newspaper Banner
Date of Publish : 25 February 2026, 6:12 pm Posted by : ramakrishna

సైబర్ నేరాల పట్ల జాగ్రత్తగా ఉండాలి

 

. . . సబ్ ఇన్స్ పెక్టర్ రాజశేఖర్

 

. . . జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో పోలీస్ కళాబృందంచే అవగాహన కార్యక్రమం

 

కామారెడ్డి, బతుకమ్మ :

 

సైబర్ నేరాల పట్ల జాగ్రత్త వహించాలని సబ్ ఇన్స్ పెక్టర్ రాజశేఖర్ సూచించారు. పోసానిపేటలోని జిల్లా పరిషత్ హైస్కూల్ లో మాదక ద్రవ్యాలు, మైనర్ డ్రైవింగ్, సైబర్ నేరాలు, వేసవి కాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు లాంటి వివిధ సామాజిక అంశాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కామారెడ్డి జిల్లా సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ ఎం.రాజేష్ చంద్ర ఆదేశానుసారం సబ్-ఇన్స్పెక్టర్ రాజశేఖర్ ఆధ్వర్యంలో బుధవారం పోలీస్ కళాబృందంచే ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎవరైనా సైబర్ నేరానికి పాల్పడినట్టు అనిపిస్తే 1930 టోల్ ఫ్రీ నెంబర్ కి కాల్ చేయాలని, అత్యవసర సమయంలో 100 కి కాల్ చేయాలని, ఇంస్టాగ్రామ్, ఫేస్ బుక్, సోషల్ మీడియాతో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అలాగే విద్యార్థులు మంచి లక్ష్యంతో చదువు కోవాలని, ఏ చిన్న కేసు అయినా జీవితాలు నాశనం అవుతాయని తెలిపారు. అనంతరం పీసీ భాను షీ టీమ్స్ పై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ కళాబృందం ఇన్చార్జి హెడ్ కానిస్టేబుల్ రామంచ తిరుపతి, హెడ్ కానిస్టేబుల్ యు.శేషరావు, పిసి.సాయిలు, హెడ్ మాస్టర్ శ్రీనివాస్, ఉపాధ్యాయ బృందం, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

 

Be careful of cybercrime
Be careful of cybercrime