Batukammanews
Newspaper Banner
Date of Publish : 27 April 2025, 4:16 pm Posted by : ramakrishna

ఐదు రోజులు జాగ్రత్త..

తెలంగాణలో రోజురోజుకూ పెరుగుతున్న పగటి ఉష్ణోగ్రతలు

హైదరాబాద్, బతుకమ్మ: తెలంగాణలో రోజురోజుకూ పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఐదు రోజులు జాగ్రత్తగా ఉండాలని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది.  ఎండల తీవ్రత నేపథ్యంలో ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల, భూపాలపల్లి, కరీంనగర్, ఖమ్మం, ఆసిఫాబాద్, సహా 16 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ను సూచించింది. మిగిలిన జిల్లాలకు ఎల్లో అలర్ట్ ను వాతావరణశాఖ జారీ చేసింది.