Batukammanews
Newspaper Banner
Date of Publish : 06 February 2026, 7:46 pm Posted by : ramakrishna

అందుబాటులో ఉండి సమస్యలు పరిష్కరిస్తా …

 

. . . 14వ వార్డు స్వతంత్ర అభ్యర్థి రుద్రంగి రమ్య అశోక్

 

బాన్సువాడ, బతుకమ్మ :

 

ఈనెల 11 న నిర్వహించనున్న మున్సిపాలిటీ ఎన్నికలలో తనను కౌన్సిలర్ గా గెలిపిస్తే అందుబాటులో ఉండి సమస్యలు పరిష్కరిస్తానని 14వ వార్డు స్వతంత్ర అభ్యర్థి రుద్రంగి రమ్య అశోక్ పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం బాన్సువాడ పట్టణంలోని 14వ వార్డులో విస్తృతంగా ప్రచారం చేపట్టారు. అనంతరం వారు మాట్లాడుతూ తనకు ఒక్కసారి కౌన్సిలర్ గా అవకాశం కల్పిస్తే కాలనీ ని అభివృద్ధి చేసి చూపిస్తానని హామి ఇచ్చారు. టవార్డు లో సమస్యలను పరిష్కరించి మీముందుకు వస్తామని ఓటర్లకు భరోసా కల్పించారు. వార్డులో నెలకొన్న సమస్య లు ఏవైనా ఉంటే తమ దృష్టికి తీసుకువస్తే వాటిని వెనువెంటనే పరిష్కరించేందుకు పెద్దల సహకారంతో కృషి చేస్తామన్నారు. ఆయన వెంట రుద్రంగి గంగాధర్, రుద్రాంగి మురళి, రుద్రంగి నటరాజ్, యాదవ్, కాలనీవాసులు, తదితరులు పాల్గొన్నారు.