అప్రమత్తంగా ఉండండి.. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కు పోలీసుల సూచన
వెబ్ న్యూస్, బతుకమ్మ : బెదిరింపు కాల్స్ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కు మంగళ్ హాట్ పోలీసులు నోటీసులు ఇచ్చారు. 1+4 భద్రతను సద్వినియోగం చేసుకొని బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని వాడుకోవాలని పోలీసులు సూచించారు. గోషామహల్ లో చిన్న చిన్న గల్లీల్లో బుల్లెట్ ప్రూఫ్ వాహనంతో ప్రజల్లోకి వెళ్లలేనని రాజాసింగ్ పోలీసులకు తెలిపారు. తన గన్ లైసెన్స్ దరఖాస్తు చాలా రోజులుగా పెండింగ్ లో ఉందని.. లైసెన్స్ ఇవ్వాలని పోలీసులను ఎమ్మెల్యే రాజాసింగ్ కోరారు.