భారీ వర్షాల నేపధ్యంలో అప్రమత్తంగా ఉండాలి
ప్రాణ నష్టం వాటిల్లకుండా ముందు జాగ్రత్తలు చేపట్టాలి ఉమ్మడి జిల్లా ప్రత్యేక అధికారి రాజీవ్ గాంధీ హనుమంతు కలెక్టర్ తో కలిసి అధికారులతో సమీక్ష నిజామాబాద్, బతుకమ్మ : ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపధ్యంలో అంతటా అప్రమత్తంగా ఉండాలని నిజామాబాద్ ఉమ్మడి జిల్లా ప్రత్యేక అధికారి, సీనియర్ ఐఏఎస్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. నిజామాబాద్ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో శనివారం ఆయన కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డితో కలిసి భారీ వర్షాలు, సీజనల్ వ్యాధులు, యూరియా ఎరువుల...