పోస్ట్-వైరల్ రుమాటిజంపై అప్రమత్తంగా ఉండాలి
. సరైన సమయంలో సరైన మందులు వేసుకోవాలి . రుమటాలజిస్ట్ పర్యవేక్షణతో పోస్ట్ వైరల్ రుమాటిజం నుంచి విముక్తి నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: పోస్ట్-వైరల్ రుమాటిజం (విషజ్వరాలు)పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కన్సల్టెంట్ రుమటాలజిస్ట్, నిజామాబాద్ రుమటాలజీ అండ్ ఆర్థరైటిస్ సెంటర్ డాక్టర్ జి.గ్రీష్మ ఒక ప్రకటనలో సూచించారు. ముఖ్యంగా వర్షకాలంలో చికున్ గున్యా, డెంగీ వంటి వ్యాధులు విజృంభిస్తున్నాయని, జ్వరం తగ్గిన తర్వాత చాలా మందికి కీళ్ల నొప్పులు వస్తుండడం చూస్తున్నామని, దీన్నే పోస్ట్ వైరల్ రుమాటిజం అంటారని పేర్కొన్నారు. వయసుతో సంబంధం...