నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: ఎంఎల్సి ఎన్నికల్లో బిసి వైపి పార్టీ పోటీ చేస్తుందని బిసి ఎైపి పార్టి తెలంగాణ రాష్ట్ర ఇన్చార్జీ జయికుమార్ తెలిపారు. నిజామాబాద్ జిల్లా ప్రెస్ క్లబ్ భవన్ లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. భారత దేశంలో ప్రజాస్వామ్య విలువలు కాపాడుట,అవినీతి అంతం చేయుట,సామాజికంగా వెనుక బడిన వర్గాల యువతను రాజకీయంగా రాణించడం,శాసనసభలో యువతకు ఏ రాజకీయ పార్టీలు అవకాశాలు కల్పించక పోవడం,దేశంలో సేవ పేరుతో ఎన్నికల్లో గెలిచిన నాయకులు అవినీతికి పాల్పడటం, కలత చెంది యువతను రాజకీయంగా ప్రోత్సహించడం ప్రజా స్వామ్యంలో మార్పు అవసరమని భావించి భారత యువ చైతన్య యువజన పార్టీ వ్యవస్థాపకులు రామ్ చంద్ర యాదవ్ సంకల్పించారని అన్నారు. 2025 సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రంలో జరగబోతున్న ఎంఎల్సీ ఎన్నికల్లో “భారత యువ చైతన్య యువజన పార్టీ” పోటీ చేస్తుందని,పార్టీ అభ్యర్థుల జాబితాను హైకమాండ్ పరిశీలనలో ఉన్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత జగిత్యాల జిల్లా అధ్యక్షుడు న్యాయవాది సాయికృష్ణ యాదవ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో విద్య పరంగా ,సాంకేతిక వృత్తి విద్య, కోర్సుల స్థాపన అవసరం వుందని,ఆ దిశగా పాలకులు ఆలోచించటం లేదని,బీఆర్ఎస్ పార్టీ పది సంవత్సరాల అధికార కాలంలో ఉద్యోగాలు కల్పనలో యువతను మోసం చేసిందని దుయ్య బట్టారు. ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజలకు రైతులకు సంక్షేమ పథకాల పేరు తో ఉసర వేల్లిలా నెలకు ఒక పథకం ప్రకటిస్తూ ప్రజలను,యువకులను ఆకర్షించేందుకు అధికార పీఠంకోసం తాపత్రయం పడుతున్నాయని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో విద్య పరంగా వెనుకబడిన ఆదిలాబాద్ లో, ప్రత్యేక ట్రైబల్ యూనివర్శిటీ ఏర్పాటు అవసరం వుందని,దానిని ఏ పార్టీలు గుర్తిస్తాలేవని విమర్శించారు. ఈ సందర్భంగా ఎంఎల్సీ ఎన్నికల్లో తెలంగాణ ఆర్టీఐ కమిటి మద్దతు ఇస్తున్నట్లు బాలరాజునాయక్ ప్రకటించారు.ఈ కార్యక్రమంలో జయకుమార్,సాయికృష్ణ యాదవ్,శేఖర్,బాలరాజు నాయక్ ,రాజశేఖర్,సురేష్ లు పాల్గొన్నారు.