Batukammanews
Newspaper Banner
Date of Publish : 01 May 2026, 6:37 pm Posted by : ramakrishna

సూపరిండెంట్ నాగరాజు ని సన్మానించిన బిసిటియు నాయకులు

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

జిల్లా టిఎన్జివో అసోసియేటడ్ అధ్యక్షులు గా ఎన్నుకోబడ్డ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ సూపరింటెండెంట్ పెద్దొళ్ల నాగరాజు ని మెడికల్ కళాశాల లో బిసి ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షులు మాడవేడి వినోద్ కుమార్ ఆధ్వర్యంలో శాలువా పూల బొకే తో శుక్రవారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మాడవేడి వినోద్ కుమార్ మాట్లాడుతూ నాగరాజు ఉద్యోగులకు అందిస్తున్న సేవలను, ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి చేస్తున్న కృషిని అభినందించారు. ఈ కార్యక్రమంలో గవర్నమెంట్ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్ కృష్ణ మోహన్, బిసిటియు జిల్లా ప్రధాన కార్యదర్షి రాఘవాపురం గోపాలకృష్ణ, గౌరవ అధ్యక్షులు కైరంకొండ బాబు, కార్యనిర్వాహక అధ్యక్షులు కంచరి రవికుమార్, కొట్టాల రామ కృష్ణ, గౌరవ సలహాదారులు రమణ స్వామి, మాక్లూర్ మండల బిసిటియు అధ్యక్షులు గంగోనె సంజీవ్, నాయకులు సుమన్, రవిచంద్ర తదితరులు పాల్గొన్నారు.