. . . బీసీలు పోరాటం చేసే చారిత్రక సందర్భం వచ్చింది
. . . ఎమ్మెల్సీ కవిత బీసీ కాకపోయినా బీసీల కోసం పోరాడుతున్నారు
. . . రాజ్యసభ సభ్యులు ఆర్.కృష్ణయ్య
హైద్రాబాద్ , బతుకమ్మ:
బీసీల కోసం అన్ని సంఘాలు, రాజకీయ పార్టీలు మద్దతు ఇవ్వాలి. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కోసం ఎవరు ఉద్యమం చేసినా బీసీలు మద్దతు ఇవ్వాలని రాజ్యసభ సభ్యులు ఆర్.కృష్ణయ్య పిలుపు నిచ్చారు. హైద్రాబాద్ లోని విద్యానగర్ లోని బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపి ఆర్ కృష్ణయ్య నివాసంలో బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కలిశారు. బిసీల రిజర్వేషన్ ల సాధనకు జూలై 17న జరిగే రైల్ రోకోకు మద్ధత్తు ఇవ్వాలని కవిత, రాజ్యసభ సభ్యులు ఆర్.కృష్ణయ్య ను కోరారు. ఈ సంధర్బంగా ఆర్.కృష్ణయ్య మాట్లాడుతు… బీసీలకు 75 ఏళ్లుగా అన్యాయం జరుగుతోంది. బీసీలు పోరాటం చేసే చారిత్రక సందర్భం వచ్చిందన్నారు. ప్రజా ఉద్యమం చేయకపోతే బీసీల హక్కులు నెరవేరవని, బీసీలు కమిట్మెంట్ తో పోరాటం చేయకపోతే ఇప్పుడు ఉన్న బీసీ రిజర్వేషన్లు తగ్గుతాయని హెచ్చారించారు. ప్రభుత్వానికి బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలనే చిత్తశుద్ధి లేదని విమర్శలు చేశారు. ప్రభుత్వం పులి మీద స్వారీ చేస్తుందని గుర్తించాలని అన్నారు. బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వకుండా ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం చూస్తోందని ఆరోపించారు.
బీసీల రిజర్వేషన్లు కోసం పోరాటం చేసే వారిని ఎవరు తప్పుపట్టవద్దని , బీసీలు ఉద్యమం చేస్తేనే కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు దిగి వస్తాయన్నారు. బీసీల కోసం కవిత ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు .కవితకు బీసీలు అండగా ఉండాలి అని కోరారు. కవిత బీసీ కాకపోయినా బీసీల కోసం పోరాడుతున్నారు. జూలై 17 న జరిగే తెలంగాణ జాగృతి రైల్ రోకోకు కచ్చితంగా మద్దతు ఇస్తామని కవిత ఎవరి కోసం పోరాటం చేస్తుంది బీసీల కోసమే కదా అని ఎంపి ఆర్ కృష్ణయ్య అన్నారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్లు అమలు చేసే ఎన్నికలు నిర్వహించాలి
. . . తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత
కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలి. కాంగ్రెస్ ప్రభుత్వం జీవో ఇచ్చి 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసే అవకాశం ఉంది.కానీ అసెంబ్లీలో బిల్లు పాస్ చేసాం.. కేంద్రం ఆమోదించాలని చెబుతుంది.స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్లు అమలు చేసే ఎన్నికలు నిర్వహించాలి. ఈ అంశంపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రజా ఉద్యమాలే శరణ్యం అని కవిత అన్నారు. బిసీలకు 42 శాతం రిజర్వేషన్ ల కోసం జరుప తలపెట్టిన రైల్ రోకోకు బిసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య మద్దతు కోరడానికి వచ్చాం అన్నారు.