ప్రతి జనరల్ స్థానంలో సర్పంచ్ పదవికి బీసీలు పోటీ చేయాలి
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు రాకపోవడం చాలా బాధాకరం ఈ పరిస్థితుల్లో బీసీలకు కేవలం 22% రిజర్వేషన్లు రావడం శోచనీయం అని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్ అన్నారు. 50% జనరల్ స్థానాలు కేటాయించబడ్డాయి.. 50% జనరల్ స్థానాల్లో ప్రతి బీసీ బిడ్డ పోటీ చేయాలి, ఆ ఊరిలోని బీసీ కులస్తులందరూ ఏకమై ఒకే ఒక బీసీ అభ్యర్థిని జనరల్ స్థానంలో నిలబెట్టుకొని అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలి అని అన్నారు. జనరల్ స్థానాల్లో కూడా...