Batukammanews
Newspaper Banner
Date of Publish : 20 November 2025, 5:31 pm Posted by : ramakrishna

బీసీ జేఏసీ రిలే నిరాహార దీక్షలో గర్జించిన బీసీలు

ధర్పల్లి, బతుకమ్మ : ధర్పల్లి మండల కేంద్రంలోని మహాత్మగాంధి చౌరస్తా వద్ద  బీసి,ఎస్సీ, ఎస్టీ,కులాల రిలే నిరాహార దీక్ష ధర్పల్లి బీసీ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా నిజామాబాద్ జిల్లా బీసీ జేఏసీ ఛైర్మెన్ లక్ష్మీ నారాయణ, వైస్ ఛైర్మెన్ బొబ్బిలి నర్సయ్య, అంబ దాస్, జేఏసీ సభ్యులు నాగరాజ్, కిషన్, గుట్ట గంగాధర్, ప్రమోద్, మురళి, హైమద్ సంగీభవం తెలపడానికి ధర్పల్లి రిలే నిరాహార దీక్షలో భాగస్థులయ్యారు. ఈ రిలే నిరాహారదీక్షలో భాగంగా నిజామాబాద్ జిల్లా బీసీ జేఏసీ ఛైర్మెన్ మాట్లాడుతూ.. బీసీ లు సంఘటితంగా ఉండి బీసీ ఉద్యమాన్ని గ్రామాల స్థాయినుండి రాష్ట్ర వ్యాప్తంగా ముందుకు తీసుకువెళ్లాలని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలోనే రిలే నిరాహార దీక్ష నిర్వహించిన మొదటి మండలంగా ధర్పల్లి మండలం చరిత్రలో నిలిచిపోతుందని అన్నారు. అంతం కాదు ఇది ఆరంభం మాత్రమే ధర్పల్లి గ్రామాన్ని స్ఫూర్తిగా తీసుకుని జిల్లాలోని వివిధ గ్రామాల బీసీ జేఏసీ లు రిలే నిరాహార దీక్షలు చేపట్టేలా బీసీ లు కంకణం కట్టుకోవాలాని అన్నారు. మీరెంతో మీకంతే మేమెంతో మాకంత మీరు మాకిచ్చేది ఏందీ మాకు మేమే సాధించుకుంటామని అన్నారు. బీసీలు ఒక్కటేవుతే ధర్పల్లి మండల జేఏసీ కన్వీనర్ సంబేటి సుమన్ మాట్లాడుతూ… ధర్పల్లి మండలంలో బీసీ జేఏసీ తరపున బీసీ 42 శాతం రిజర్వేషన్ల సాధన కేవలం స్థానిక ఎన్నికలలోనే కాకుండా చట్ట సభల్లో విద్యా, ఉద్యోగ, రాజకీయంగా రాజ్యాధికారం సాధించేవరకు బీసీ లు జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా శాంతియుత ఉద్యమాలు చేపట్టాలని అన్నారు. బీసీ 42% రిజర్వేషన్ సాధనలో బీసీ లు బీసీ జేఏసీ ఉద్యమాలకు ముందుండి బీసీ ల ఐక్యతను చూపెట్టి అగ్రవర్ణాల మెడలు వంచి కేంద్ర రాష్ట్రాలు 42% రిజర్వేషన్ చట్టసభల్లో అమలుపరిచేలా కృషిచేయాలనీ అన్నారు. అదేవిధంగా ఏ ఉద్యమమైన ఒక్కరితో మొదలై మహా సముద్రంగా ప్రళయంల మారుతుందని అన్నారు. న్యాయభద్ధమైన బీసీ రిజర్వేషన్ ల హక్కుల సాధనకై ఉద్యమ వీరులు గలం విప్పాలని పిలుపినిచ్చారు. అత్యధిక జనాభా కలిగిన బీసీలు అన్నీ రకాలుగా వెనుకబడి ఉన్నారని ఇకనైనా బానిస బ్రతుకులు మాని రాజ్యాధికారం కోసం ఎగబడాలని అన్నారు. వడ్డించే వాడు మన వాడైతే ఎక్కడ ఉన్న కడుపు నిండా భోజనం లభిస్తుందని అన్నారు. అనంతరం జేఏసీ కో కన్వీనర్ చెలిమేల నర్సయ్య, సిపిఎం ఎల్ న్యూడెమోక్రసి భీంగల్ ఏరియా ప్రధాన కార్యదర్శి బాలయ్య మాట్లాడుతూ…బీసీ కులాలలో బడుగు బలహీన వర్గాలు వెనుకబడిన తరగతుల కుటుంబాలు తెలంగాణ రాష్ట్రంలో కోకోల్లలుగా ఉన్నాయని,ఆంధ్ర రాష్ట్రం నుండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో మలిదశ ఉద్యమాలు ఆనాడు చేపట్టి ,ఎందరో మహనీయుల బలిదానాల వల్ల ఆహుతి అయిన మహానుభావులలో అత్యధికంగా బీసీ కులాల వెనుకబడిన వర్గాల నుండి పోరాడి తెచ్చుకున్న వీర తెలంగాణను ఇకనైనా తీర్చి దిద్దుకుందామన్న మళ్లీ రెడ్డి,రావుల పరిపాలనలో కృంగి కృషించి యధావిధిగా బానిసత్వ జీవులుగా పెత్తందారులకు గత్యంతరం లేక వారి మోచేతి నీళ్లు త్రాగడం బానిసలుగా జీవించడం కొనసాగుతుంటే ఇంకా ఎన్నాళ్ళు ఈ బానిస సంకేళ్ళ బ్రతుకులు అని, బిసి కులాల బడుగు బలహీన వర్గాలకు కనీసం 42% శాతం రిజర్వేషన్ రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు చొరవచేసుకుని రానున్న స్థానిక ఎన్నికలలో అవకాశాలు కల్పిస్తే బీసీ,ఎస్సీ,ఎస్టి, కుల వర్గాలకు రాజకీయ రీత్యా ఉద్యోగాల రీత్యా అభివృద్ధి కొరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తోడ్పడాలని,రిలే నిరాహార దీక్ష చేపట్టామని అన్నారు. దీక్షలో భాగంగా ప్రభుత్వాలను వేడుకున్నారు. నిరాహార దీక్షలో భాగంగా ధర్పల్లి మండల కన్వీనర్ సంబేటి సుమన్,గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు గంగాధర్ సురేందర్,చెలిమెల నవీన్,శ్రీనివాస్ గౌడ్,కటికే శంఖర్  తదితరులు పాల్గొన్నారు.