బీసీ జేఏసీ ఆధ్వర్యంలో బీసీల న్యాయసాధన దీక్ష

కామారెడ్డి, బతుకమ్మ : తెలంగాణ రాష్ట్ర బీసీ జేఏసీ పిలుపుమేరకు కామారెడ్డి జిల్లా కేంద్రంలో బీసీల న్యాయసాధన దీక్ష కామారెడ్డి లోని నిజాంసాగర్ చౌరస్తాలో కానిస్టేబుల్ క్రిష్టయ్య ప్రాంగణంలో నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీ జేఏసీ ప్రతినిధులు మాట్లాడుతూ బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు న్యాయబద్ధమైనవని అసలైతే బీసీలకు జనాభా ప్రతిపాదికన 60 శాతం రిజర్వేషన్లు కల్పించాల్సిన అవసరం ఉందని అన్నారు. కానీ గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 42 శాతానికి కట్టుబడి ఉండి బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని, కామారెడ్డి బీసీ...