Batukammanews
Newspaper Banner
Date of Publish : 15 March 2026, 11:23 am Posted by : ramakrishna

ఫీజు పోరు దీక్షకు తరలిన బీసీ సంక్షేమ సంఘం నాయకులు 

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : 

 

ఫీజు రియంబర్స్ మెంట్ బకాయిలను విడుదల చేయాలనే డిమాండ్ తో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ పిలుపుతో బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్ లోని ఇందిరాపార్క్ వద్ద ధర్నా చౌక్ లో నిర్వహిస్తున్న “ఫీజు పోరు దీక్షకు బీసీ సంక్షేమ సంఘం జిల్లా నాయకులు తరలివెళ్లారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్ మాట్లాడుతూ ఫీజు రీయింబర్స్ మెంట్ స్కాలర్ షిప్ డబ్బులు విడుదల కాకపోవడంతో బడుగు బలహీన వర్గాల విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమవుతున్నారన్నారు. ప్రభుత్వం వెంటనే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేసి నిరుపేద విద్యార్థులను ఆదుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో నరాల సుధాకర్ తో పాటు దర్శనం దేవేందర్, కొయ్యాడ శంకర్, బగ్గలి అజయ్, చంద్రకాంత్, సాయి బసవ, దయానంద్, సందేశ్, సందీప్, నరేష్, శివ, కిరణ్ తదితరులు పాల్గొన్నారు