బీసీ రిజర్వేషన్ల పిటిషన్ విచారణ అక్టోబర్ 8కి వాయిదా

హైదరాబాద్, బతుకమ్మ : బీసీలకు స్థానిక ఎన్నికల్లో 42శాతం రిజర్వేషన్లపై దాకలైన పిటిషన్ పై విచారణ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. రిజర్వేషన్ల అంశం గవర్నర్ వద్ద పెండింగ్ లో ఉన్నప్పుడు ప్రభుత్వం జీఓ ఇవ్వడం సరికాదని పేర్కొంది. అవసరమైతే 10రోజుల పాటు ఎన్నికలను వాయిదా వేయవచ్చని వ్యాఖ్యానించింది. ఈ అంశంలో కోర్టు జోక్యం చేసుకోవద్దనుకుంటే ప్రభుత్వ నిర్ణయం ఏంటో చెప్పాలని ఆదేశించింది. తదుపది విచారణ అక్టోబర్ 8కి వాయిదా వేసింది.