Batukammanews
Newspaper Banner
Date of Publish : 22 November 2025, 4:25 pm Posted by : ramakrishna

డిసెంబర్ 9న బీసీ తిరుగుబాటు మహాసభ

  • బీసీ రాష్ట్ర అధ్యక్షుడు సత్యనారాయణ

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :  18 శాతం బీసీ రిజర్వేషన్లతో సర్పంచ్ ఎన్నికలు నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న స్థానిక సంస్థల కార్యాచరణను వెంటనే నిలిపివేసి ఇచ్చిన హామీ మేరకు 42 శాతం కేంద్ర, న్యాయ అనుమతి వచ్చేవరకు ఎన్నికలు రాష్ట్రంలో నిర్వహించోద్దని డిమాండ్ తో డిసెంబర్ 9న నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పాత కలెక్టర్ మైదానంలో నిర్వహిస్తున్నామని తెలంగాణ బ్యాక్వర్డ్  రాష్ట్ర అధ్యక్షుడు సత్యనారాయణ పేర్కొన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన బీసీ సంఘం ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీసీ రాష్ట్ర అధ్యక్షుడు సత్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరయ్యరు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. బీసీ సంఘం నేత దోసపూడి నరహరి నేతృత్వంలో 16 మందితో, సీనియర్ నాయకుడు భాష 16 మందితో, సీనియర్ నాయకుడు భాస రాజేశ్వర్ నేతృత్వంలో సలహామండిలిని ఏర్పాటు చేశామని ఆహ్వాన సంఘం వివరాలను ఆయన వెల్లడించారు. ఇది కేవలం ప్రాథమిక కమిటీ మాత్రమేనని త్వరలో నగర, రూరల్, నియోజకవర్గ కమిటీలను, కుల సంఘాలతో సమన్వయ కమిటీలను ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. ఆ కమిటీలు జిల్లా, సమీప జిల్లాలో విస్తృతంగా పర్యటించి, గ్రామ కుల సంఘాలతో ఇక్కడ సమన్వయ కమిటీలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఆ కమిటీలు జిల్లా, సమీప జిల్లాలో విస్తృతంగా పర్యటించి గ్రామ కుల సంఘాల ప్రజాసంఘాలను కలుపుకొని చైతన్య సదస్సులను ఏర్పాటు చేసి డిసెంబర్ 9న జరిగే మహాసభను విజయవంతం చేసే దిశగా కార్యాచరణను రూపొందించుకుంటారని తెలిపారు. ఈ చైతన్య సభలో రాష్ట్ర ప్రభుత్వం తమ హామీలను నిలబెట్టుకోవడంలో రెండు సంవత్సరాలుగా చేసిన కాలయాపనను ఎగరగొట్టడానికి చేసిన కుట్రను వివరిస్తారని తెలిపారు. ఈ విషయంలో రాజకీయ పార్టీలను అవగాహనతో చేసిన మోసాన్ని వివరిస్తారని తెలిపారు. విలేఖరుల సమావేశంలో కోకన్వీనర్లు కొండవీటి శ్యాం ప్రసాద్, గుట్టు గంగాధర్, హనుమంతరావు, నాగన్న, అంబదాస్, పృధ్విరాజ్, రేంజర్ల సురేష్ ( అడ్వకేట్) అరుణ్ జోతి  తదితరులు పాల్గొన్నారు.