Batukammanews
Newspaper Banner
Date of Publish : 17 October 2025, 1:28 pm Posted by : ramakrishna

బీసీ రాష్ట్ర బంద్ కు తమ సంపూర్ణ మద్దతు

నిజామాబాద్, బతుకమ్మ :  ఈనెల 18న తలపెట్టిన బీసీ బంద్ “బంద్ ఫర్ జస్టీస్” కు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని టీజీ ఓ మరియు టీఎన్జీవో సంఘాలు నాయకులు తెలిపారు. ఈమేరకు శుక్రవారం బీసీ సంక్షేమ సంఘం నాయకులు టీజీవో అధ్యక్షుడు అలుక కిషన్, టిఎన్జీవో అధ్యక్ష కార్యదర్శులు సుమన్, శేఖర్ లను  కలిశారు.  ప్రభుత్వం ఇవ్వదల్చిన 42 శాతం రిజర్వేషన్లకు అడ్డంకులు ఏర్పడడంతో   బీసీ రాష్ట్ర జేఏసీ నాయకులు ఆర్ కృష్ణయ్య,  జాజుల శ్రీనివాస్ గౌడ్ ఈనెల 18న బంద్ ఫర్ జస్టిస్” కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. దీంతో  టీజీవో మరియు టిఎన్జీవో వర్గం సభ్యులను కలిసి వారిని బందుకు మద్దతు కోరామని  జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు నరాల సుధాకర్ అన్నాడు.
ఈ పోరాటం న్యాయ పోరాటమని… దీనికి అన్ని వర్గాల సహాయ సహకారాలు ఉంటేనే బంద్ విజయవంతం అవుతుందని బుస్స ఆంజనేయులు అన్నారు.   దర్శనం దేవేందర్, గంగ కిషన్, కరిపే రవీందర్, మాడవేడి వినోద్, శ్రీలత, చంద్రమోహన్, చంద్రకాంత్, నారాయణరెడ్డి, దారం భూమన్న ఆర్టీసీ శ్రీనివాస్ బాలన్న, చైతన్య, తదితరులు పాల్గొన్నారు.