Batukammanews
Newspaper Banner
Date of Publish : 11 November 2025, 1:33 pm Posted by : ramakrishna

13న “బిసిల ధర్మ పోరాట దీక్ష”

…బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : 

 

బీసీలకు విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో 42% రిజర్వేషన్లు అమలు చేయాలని, ఇందుకోసం రాజ్యాంగాన్ని సవరించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచడానికి ఈ 13న “బిసిల ధర్మ పోరాట దీక్ష చేపట్టానున్నట్లు బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్ అన్నారు. నగరంలోని బీసీ సంక్షేమ సంఘం కార్యాలయంలో మంగళవారం  ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర బీసీ జేఏసీ ఇచ్చిన పిలుపుమేరకు అష్టాంగ ఆందోళనల కార్యక్రమాలు కొనసాగుతున్నాయన్నారు. అందులో భాగంగా ఈనెల 13వ తేదీన అనగా గురువారం రోజున రాష్ట్ర వ్యాప్తంగా “బిసిల ధర్మ పోరాట దీక్ష” చేపట్టాలని రాష్ట్ర బిసి జేఏసి కో చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ పిలుపునిచ్చారన్నారు. 13వ తేదీన అన్ని జిల్లా, నియోజకవర్గ, మండల, కేంద్రాలలో ధర్మ పోరాట దీక్షలలో వేలాదిగా పాల్గొని విజయవంతం చేయాలని నిజామాబాద్ జిల్లా రాజకీయ నాయకులకు, బీసీ జేఏసీ నేతలకు, బీసీ సంఘాలకు, కుల సంఘాలకు, విద్యార్థి, యువజన, మహిళ, ఉద్యోగ సంఘాలకు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నామని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్ అన్నారు.రాష్ట్ర బీసీ జేఏసీ తీసుకున్న నిర్ణయాలకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని బిఎల్పి రాష్ట్ర అధ్యక్షుడు దండి వెంకట్ అన్నారు. ఈ “ధర్మ పోరాట దీక్షలో” తాము కూడా పాల్గొంటామని అన్నారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆంజనేయులు అన్నారు .ఈ విలేకరుల సమావేశంలో బుస్స ఆంజనేయులు, ఆకుల ప్రసాద్, దర్శనం దేవేందర్, కొయ్యాడ శంకర్, చంద్రకాంత్, కోడూరు స్వామి, బసవ సాయి, ఆర్టీసీ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.