బీసీ డిక్లరేషన్ ను అమలు చేయాలి

బిజెపి ఓబీసీ జిల్లా అధ్యక్షుడు యామాద్రి భాస్కర్ ఆర్మూర్, బతుకమ్మ : శాసనసభ ఎన్నికల సమయంలో కామారెడ్డిలో ప్రకటించిన బీసీ డిక్లరేషన్ ను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమలు చేయాలని బిజెపి ఓబీసీ జిల్లా అధ్యక్షుడు యామాద్రి భాస్కర్ అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని ప్రెస్ క్లబ్ భవనంలో సోమవారం విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ ప్రకటించి 28 శాతం ఉన్న బీసీల రిజర్వేషన్ ను 42 శాతం చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చి విస్మరించారన్నారు....