బురుడుగల్లీ సందర్శించిన బీసీ కమిషన్
మేదరి కులస్థుల స్థితిగతులు క్షేత్రస్థాయిలో పరిశీలన నిజామాబాద్, బతుకమ్మ : తెలంగాణ బీసీ కమిషన్ సభ్యుల బృందం సోమవారం రాత్రి నిజామాబాద్ నగరంలోని బురుడుగల్లీ ప్రాంతాన్ని సందర్శించారు. స్థానికంగా దశాబ్దాల కాలం నుండి నివాసాలు ఉంటున్న మేదరి కులస్తుల జీవన స్థితిగతులను క్షేత్రస్థాయి సందర్శన ద్వారా ప్రత్యక్షంగా పరిశీలించారు. కమిషన్ ఛైర్మన్ నిరంజన్, సభ్యులు రాపోలు జయప్రకాష్, తిరుమలగిరి సురేందర్, బాలలక్ష్మీలు మేదరి కులస్తులకు చెందిన ఒక్కో ఇంటిని సందర్శిస్తూ, వారి ఆర్థిక, సామాజిక పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. వెదురుతో తయారు చేసిన...