. . . కామారెడ్డి జిల్లా నుంచి తెలంగాణ రాజ్యాధికార పార్టీ కార్యకర్తల భారీ తరలింపు
కామారెడ్డి, బతుకమ్మ :
భువనగిరిలో నిర్వహించనున్న తెలంగాణ రాజ్యాధికార పార్టీ (టీఆర్పీ) “రాజ్యాధికార సమరభేరి” సభకు కామారెడ్డి జిల్లా నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివెళ్లారు. కామారెడ్డి, బాన్సువాడ, ఎల్లారెడ్డి, జుక్కల్ నియోజకవర్గాల నుంచి వందలాది మంది కార్యకర్తలు వాహనాల ద్వారా భువనగిరికి బయలుదేరినట్లు పార్టీ నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు తహర్, వర్కింగ్ ప్రెసిడెంట్ సబ్బిడి రమేష్, జిల్లా ఉపాధ్యక్షులు రాజు, ఓబీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు సంగమేశ్వర్, ఎల్లారెడ్డి ఇంచార్జ్ హన్మాండ్లు, తుకారం, భాగయ్య, జుక్కల్ ఇంచార్జ్ ఈశ్వర్‌తో పాటు పలువురు మండల అధ్యక్షులు, నాయకులు మాట్లాడారు. బీసీలకు రాజకీయంగా రాజ్యాధికారం సాధించడమే పార్టీ ప్రధాన లక్ష్యమని వారు పేర్కొన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ప్రభుత్వాలు బీసీలకు తగిన ప్రాధాన్యం ఇవ్వడంలో విఫలమయ్యాయని ఆరోపించారు. తెలంగాణలో బీసీ ముఖ్యమంత్రి కావాలంటే తెలంగాణ రాజ్యాధికార పార్టీనే ప్రత్యామ్నాయమని వారు అభిప్రాయపడ్డారు. భువనగిరిలో నిర్వహిస్తున్న “రాజ్యాధికార సమరభేరి” సభను విజయవంతం చేసేందుకు జిల్లా నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేశారని నాయకులు తెలిపారు. ఈ సభ రాష్ట్ర రాజకీయాల్లో చారిత్రాత్మక మలుపుగా నిలుస్తుందనే ఆశాభావాన్ని వారు వ్యక్తం చేశారు.