Batukammanews
Newspaper Banner
Date of Publish : 10 May 2026, 5:33 pm Posted by : ramakrishna

కేంద్రం ఇచ్చిన హామి మేరకు బీసీ కులగణన చేపట్టాలి

 

. . . బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

దేశవ్యాప్తంగా చేపట్టబోయే జాతీయ జనగణలో బీసీ కులగణన చేపడుతామని కేంద్ర ప్రభుత్వం బీసీలకు స్పష్టమైన హామీ ఇచ్చి, నేడు జరుగుతున్న జనగణలో బీసీ కులగనన చేపట్టడం లేదని, కేంద్రం గతంలో ఇచ్చిన తమ హామీ మేరకు వెంటనే బీసీ కులగణన చేపట్టాలని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్ డిమాండ్ చేశారు. ఈ విషయమై ఆదివారం నిజామాబాద్ నగరంలోని పులాంగ్ చౌరస్తాలో గల అంబేద్కర్ విగ్రహం వద్ద బీసీ సంక్షేమ సంఘం జిల్లా నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. నేడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలంగాణ రాష్ట్ర పర్యటనకు వస్తున్న సందర్భంగా దరిమిల, బీసీల నిరసన గళాన్ని వినిపించడానికి బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ పిలుపుమేరకు ప్రజాస్వామ్యబద్ధంగా, శాంతియుతంగా నల్ల కండువా ధరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎప్పుడో బ్రిటిష్ పాలకుల సమయంలో 1930 లో బీసీ కుల గణన జరిగిందని, దాదాపు 100 సంవత్సరాలు కావస్తున్న గాని బీసీ కుల గణన జరగకపోవడం విచారకరమని అన్నారు. ఈ దేశంలో చెట్టు, పుట్ట, జంతువుల గణన ఉంది కానీ, బీసీల జన గణన లేకపోవడం చాలా బాధాకరమని అన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో దర్శనం దేవేందర్, మాడవేడి వినోద్ కుమార్, కొట్టూరు చంద్రకాంత్, శ్రీలత, సాయి బసవ, బాలన్న, నర్సయ్య, సత్యనారాయణ, శంకర్, సుమన్ తదితరులు పాల్గొన్నారు.