Batukammanews
Newspaper Banner
Date of Publish : 13 December 2025, 5:23 pm Posted by : ramakrishna

బీసీ చైతన్యం నందిపేట మండలం నుంచి మొదలు కావాలి

. . . బీసీసంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్

నందిపేట్, బతుకమ్మ :

ఆనాడు తెలంగాణఉద్యమ కాలంలో బోధన్ తర్వాత నందిపేట మండలం లో దీక్షలు ఎక్కువ రోజులు కొనసాగింది.  పంచాయతీ ఎన్నికల్లో  మొదటి విడతలో బోధన్ డివిజన్ లో 60% పైగా బీసీలుగెలిచారు…. అదే బోధన్ ను ఆదర్శంగా తీసుకొని జనరల్ స్థానంలో నిలబడ్డ ప్రతి ఒక్కబీసీ బిడ్డను గెలిపించాలని ఆర్మూర్ డివిజన్ ప్రజలు ముఖ్యంగా నందిపేట మండల ప్రజలకువిన్నపం చేస్తున్నామని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్ అన్నారు.శనివారం మండల కేంద్రంలో  విలేఖరులతోమాట్లాడుతూ…ఆర్మూర్ డివిజన్ బీసీ బిడ్డలు అందరూ ఏకమై బిసి అభ్యర్థులనుసర్పంచులుగా గెలిపించుకోవాలని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్పిలుపునిచ్చారు.”ఇదే ఐకమత్యం కొనసాగితే భవిష్యత్తులో బీసీలకు అదేరాజ్యాధికారం”జనాభాలో దాదాపు60 శాతం ఉన్న మనకు 42 శాతం రిజర్వేషన్లు రాబోతుండగా అడ్డుకున్న కొందరు అగ్రవర్ణాలదుర్హంకారులకు బుద్ధి చెప్పాలంటే బీసీ  కూడా ఏకమై కులాలకు అతీతంగాగెలిచే బీసీ అభ్యర్థులకు ఈ పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేసి సర్పంచులు బీసీఅభ్యర్థులను గెలిపించాలని నరాల సుధాకర్ అన్నారు.మనమందరము ఏకమైతేదాదాపు 70% పంచాయతీలను వశం చేసుకోవాలని అన్నారు. అది  బోధన్ డివిజన్ ఎన్నికలతో నిరూపితమైందని అన్నారు. దాదాపు 60 శాతం గ్రామ పంచాయతీలను బీసీలు కైవసం చేసుకోవడం శుభసూచకమని బీసీసంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పోల్కం గంగా కిషన్ అన్నారు.ఈ విలేకరులసమావేశంలో  ప్రధాన కార్యదర్శి పోల్కం గంగకిషన్, దారం సురేష్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.