Batukammanews
Newspaper Banner
Date of Publish : 30 September 2024, 3:50 pm Posted by : ramakrishna

తెలంగాణ రంగుల పూల పండుగ బతుకమ్మ

నిజామాబాద్  సిటీ, బతుకమ్మ : తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలలో బతుకమ్మను తెలంగాణ రంగుల పూల పండుగగా జరుపు కుంటారని ఫ్యూచర్ లైన్ పాఠశాల అకాడమీక్ ఇంచార్జీ లత అన్నారు. తెలంగాణాలో ప్రసిద్ధి చెందిన బతుకమ్మ పండుగను పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని ఆర్య నగర్ లో గల ఫ్యూచర్ లైన్ స్కూల్లో బతుకమ్మ పండుగ వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు.

Bathukamma is the colorful flower festival of Telangana

అకాడమీక్ ఇంచార్జీ లత మాట్లాడుతూ దసరా పండుగకు రెండు రోజులు ముందు సద్దుల బతుకమ్మ గా ఆచరిస్తారన్నారు. వారం రోజులపాటు రంగుల పూల పండుగను మహిళలు, చిన్నారులు ఆనందోత్సాల మధ్య ప్రతిరోజు సాయంత్రం ఈ ఆర్భాటంలో నిమగ్నమై ఉంటారని తెలిపారు. ఇక చివరి రోజు రంగుల పూల బతుకమ్మను నీటిలో వదలడం ఆనవాయితీగా వస్తున్న ఆచారంగా జరుపుకుంటున్నట్లు వివరించారు, దీంతో నీటి కాలుష్యం నివారించవచ్చని పూర్వీకులు తెలుపుతున్నారని అన్నారు. ఇందులో భాగంగా ఉపాధ్యాయినిలు, విద్యార్థినిలు తెలంగాణ సాంప్రదాయ బద్దంగా పూలను అలంకరించుకుని బతుకమ్మ పాటలు పాడి రంగులు పూల పండుగను ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ లత, గౌతమి, సంధ్య, జమున, సుమలత, , గౌతమి ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.

Bathukamma is the colorful flower festival of Telangana