బతుకమ్మ,మోర్తాడ్: మన రాష్ట్ర పండుగ బతుకమ్మ అయిందని పూలను పూజించే సాంప్రదాయం ప్రపంచంలో ఎక్కడ కనబడదని, అది తెలంగాణలోనే ఉందని మహిళలు ఎంతో ఆనంద ఉత్సాహంతో నిర్వహించుకుంటారని మోర్తాడ్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్.టి. పెద్దన్న అన్నారు. సోమవారం మోర్తాడ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. కళాశాల విద్యార్థులు, మహిళా ఉద్యోగులు రకరకాల పూలతో బతుకమ్మలను పేర్చి సంబరాలు ఘనంగా నిర్వహించారు. అనంతరం పాటలు పాడుతూ కాల్వ దగ్గరికి ఊరేగింపుగా తీసుకువెళ్లి పోయిరా బతుకమ్మ పోయిరా అంటూ పాటలు పాడి బతుకమ్మను నిమజ్జనం చేశారు. విద్యార్థులకు కళాశాల ప్రిన్సిపాల్ మెమొంటోలు ప్రధానం చేశారు కార్యక్రమంలో మహిళా ఉద్యోగులు విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు.