Batukammanews
Newspaper Banner
Date of Publish : 10 October 2024, 5:47 pm Posted by : ramakrishna

ఆనందోత్సాహాల నడుమ ఘనంగా బతుకమ్మ పండుగ

బతుకమ్మ భిక్కనూరు : భిక్కనూరు మండల వ్యాప్తంగా తెలంగాణ పూల పండుగ బతుకమ్మ పండుగను మండల ప్రజలు ఆనందోత్సాహాల నడుమ ఘనంగా గురువారం జరుపుకున్నారు. ఈ సందర్భంగా మహిళలు తీరోక్క పువ్వులతో అందంగా పేర్చిన బతుకమ్మలకు ముందుగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మండలంలోని అన్ని గ్రామాల్లోని ప్రధాన వీధుల్లో బతుకమ్మలను డప్పు చప్పుళ్ల నడుమ ఊరేగించి సాయంత్రం ఆయా గ్రామాల్లో పట్టణాల్లో ఉన్న గ్రామ చెరువులు కుంటలలో బతుకమ్మలను నిమజ్జనం చేశారు. ఈ సందర్భంగా చెరువుకుంటల వద్ద మహిళలు కుటుంబ సభ్యులతో కలిసి ప్రసాదాలను ఆరగించారు.

Bathukamma festival is grand in the midst of rejoicings