Batukammanews
Newspaper Banner
Date of Publish : 28 November 2024, 9:35 pm Posted by : ramakrishna

బతుకమ్మ ఎఫెక్ట్..

  •  డాగ్ బర్త్ కంట్రోల్ పై ప్రత్యేక దృష్టి కథనానికి స్పందించిన మున్సిపల్ కమిషనర్

నిజామాబాద్ సిటీ బతుకమ్మ :  నిజామాబాద్ మున్సిపల్ కమిషనరేట్ పరిధిలో ఆయా డివిజన్లో తీవ్రమవుతున్న కుక్కల బెడద సమస్యపై గురువారం నగరం మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్ సంబంధిత శాఖ అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. గురువారం బతుకమ్మ దినపత్రికలో ప్రచురితమైన కథనాని కి స్పందించిన కమిషనర్ సంబంధిత శాఖ అధికారులను తన ఛాంబర్ లోకి పిలిపించుకొని నగరంలో కుక్కల సమస్యలపై అధికారులు ఇకపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. ఇకపై ఏ ఒక్కరు కూడా కుక్కల దాడిలో గాయపడకుండా చూడాల్సిన బాధ్యత మనపైనే ఉందన్నారు. అందుకుగాను ఇప్పటివరకు కేవలం రాత్రి వేళలో మాత్రమే వివిధ డివిజన్లో కాలనీలలో పదిమంది ప్రత్యేక బృందాలతో కుక్కల ఏరువేతల కోసం  ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేయగా ఇకపై డే టైంలో కూడా ఎక్కడ కూడా కుక్కలు కనబడకుండా వెంటనే వాటిని ఏరి వేసేందుకు వెటర్నరీ అధికారులతో కలిసి కుక్కల నివారణ కోసం వాటికి ప్రత్యేక కుటుంబ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కాగా కుక్కల ఏరివేతలో ప్రతి నిత్యం పనిచేస్తున్న ప్రత్యేక టీం లో అడిషనల్ కమిషనర్ రాజేంద్ర కుమార్ ఆధ్వర్యంలో కుక్కల నియంత్రణ కోసం ప్రత్యేకంగా నియమించిన శానిటరీ ఇన్స్పెక్టర్ సోలేమాన్ రాజ్, జవాన్లను సిబ్బందిలనుఅభినందించారు.