బతుకమ్మ ఎఫెక్ట్…

. . . స్పందించిన అధికారులు   రుద్రూర్,  బతుకమ్మ :   రుద్రూర్ మండల కేంద్రంలోని సమికృత మండల కార్యాలయం మొత్తం బూజు పట్టిందని, " బూజు పట్టిన మండల సమికృత కార్యాలయం.. పరిశుభ్రత పై అధికారుల నిర్లక్ష్యం" అనే కథనం శుక్రవారం రోజున బతుకమ్మ దినపత్రికలో ప్రచురితం కావడంతో వెంటనే స్పందించిన అధికారులు సమికృత మండల సముదాయ భవన కార్యాలయాన్ని పరిశుభ్రం చేయిస్తున్నారు. దింతో స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ బతుకమ్మ దినపత్రికకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.