బతుకమ్మ దినపత్రిక క్యాలెండర్ ఆవిష్కరణ

మద్నూర్ బతుకమ్మ:   మద్నూర్ మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో కార్యదర్శి సందీప్ బతుకమ్మ దినపత్రిక క్యాలెండర్ మద్నూర్ బతుకమ్మ దినపత్రిక విలేకరి బస్వంత్ తో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అనతి కాలంలోనే అన్ని వర్గాలలో బతుకమ్మ పత్రిక మంచి పేరు తెచ్చుకుందని, పత్రికా విలువను పాటిస్తూ ఇలానే ముందు కు సాగుతూ మరింత పేరును సంపాదించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.