Batukammanews
Newspaper Banner
Date of Publish : 26 September 2025, 6:30 pm Posted by : ramakrishna

సంస్కార భారతి ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నగరంలోని బ్యాంకు కాలనీలోని వెక్టర్ జూనియర్ కాలేజీలో సంస్కార భారతీ, వెక్టర్ కాలేజ్ యాజమాన్యం సంయుక్తంగా బతుకమ్మ సంబరాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థినీలు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. పాటలు పాడిన విద్యార్థినిలకు సంస్కార భారతి పక్షాన జ్ఞాపికలను బహుకరించారు. ఈ కార్యక్రమంలో కన్వినర్ ఎస్.మాధురి, కార్యదర్శి వరలక్ష్మి, కన్వీనర్ శంకర్, ప్రాంత కార్యదర్శి చామకూర శ్రీనివాస్ రెడ్డి, మధు, శివకుమార్, శ్రీకాంత్, రమణ చారి, వెక్టర్ జూనియర్ కాలేజ్ డైరెక్టర్ సంతోష్, చైర్మన్ మధు సూధన్ జోషి, కార్తీక్, గజానంద్, కళాశాల ఉపన్యాసకులు పాల్గొన్నారు.

Bathukamma celebrations under the auspices of Sanskara Bharathi