నిశిత డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు
నిజామాబాద్, బతుకమ్మ : తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు బతుకమ్మ వేడుకలు ప్రతీకగా నిలుస్తాయని నిశిత కళాశాల చైర్మన్లు వినయ్, నిఖిల్, కోఆర్డినేటర్ రాజు అన్నారు. నగరంలోని నిశిత డిగ్రీ కళాశాల(అటానమస్) ఆధ్వర్యంలో శుక్రవారం బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు.. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్ర సాధనలో బతుకమ్మ పండుగకు ఎంతో ప్రాధాన్యం ఉందన్నారు. కళాశాల విద్యార్థినులు రంగురంగుల పూలతో అందమైన బతుకమ్మలను తయారుచేశారు. ఇందులో ఉత్తమమైనవి ఎంపిక చేసి వారికి ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ ఓం...