Batukammanews
Newspaper Banner
Date of Publish : 26 September 2025, 7:11 pm Posted by : ramakrishna

మండల సమైక్య ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు

బతుకమ్మ, బిచ్కుంద : బిచ్కుంద మండల కేంద్రంలోని స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో మండల సమైక్య ఆధ్వర్యంలో బతుకమ్మ పండుగ సంబరాలు ఆనందోత్సాహాల మధ్య వేడుకగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపిఎం రవీందర్ బతుకమ్మ ఆడి సందడి చేయడంతో పాటు మహిళలు, చిన్నారుల్లో ఉత్సాహాన్ని నింపారు. బతుకమ్మ పండగలో  శుక్రవారం  రోజున మండల సమైక్య ఆధ్వర్యంలో రంగురంగుల పూలతో బతుకమ్మలను అందంగా పేర్చి బతుకమ్మలను మధ్యలో ఉంచి పాటలు పాడుతూ బతుకమ్మ సంబరాలను ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు. బతుకమ్మ పండగలో ఏపీఎం రవీందర్ సరదాగా బతుకమ్మ పాటకు బతుకమ్మ ఆడి అక్కడున్న వారందరికీ ఉత్సాహాన్ని కలిగించారు. ఈ సందర్భంగా పలువురు మహిళలు, చిన్నారుల  డ్యాన్సులు ఎంతగానో ఆకట్టుకొన్నాయి. బతుకమ్మ సంబరాల్లో మండల సమైక్య లోని మహిళాలు, ఉద్యోగులు, సిబ్బంది పాల్గొని ఆటపాటల మధ్య సంబురంగా జరుపుకున్నారు.

Bathukamma celebrations under the auspices of Mandal Samakya