Batukammanews
Newspaper Banner
Date of Publish : 25 September 2025, 7:29 pm Posted by : ramakrishna

ఐద్వా ఆధ్వర్యంలో బతుకమ్మ సంబురాలు

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ:  ఐద్వా జిల్లా కమిటీ సభ్యురాలు కళ ఆధ్వర్యంలో లింగి తాండ లో బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి  ఐద్వా జిల్లా కార్యదర్శి సుజాత ముఖ్య అతిధిగా హాజరయ్యారు.  ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ  జిల్లా వాసులకు బతుకమ్మ శుభాకాంక్షలు తెలుపుతూ  మత విద్వేషాలకు వ్యతిరేకంగా పోరాడుదామని, మహిళల హక్కులకై నిలబడదాం  అంటూ ప్రతి ఒక్క మహిళ పని ప్రదేశాల్లో ఎదుర్కొంటున్న సమస్యలపై కుటుంబంలో ఎదుర్కొంటున్న సమస్యలపై సమాజంలో ఎదుర్కొంటున్న సమస్యలు ఇలా అనేక సమస్యల పైన నిరంతరం పోరాటాలు నిర్వహిస్తూ నిరంతరం మహిళల కోసం అండగా ఉంటూ అలాగే బతుకమ్మ సంబరాలు, సంక్రాంతి సంబరాలు లో కూడా మహిళల  నైపుణ్యాన్ని గుర్తించి వారికి ఉన్న టాలెంట్ ని బయటపెట్టేందుకు కృషి చేస్తోంది అని తెలిపారు.   ఐద్వా ఎలాంటి పిలుపునిచ్చిన మహిళలు ముందు వరుసలో ఉండాలి అని కోరారు. ఈ కార్యక్రమంలో లింగీ తాండవాసులు పాపవ్వ  లక్ష్మి,  అనిత, లక్ష్మి,  మీరీబాయ్, నరసవ్వ, గంగమణి, సాయవ్వ, భూ దమ్మ. తదితరులు పాల్గొన్నారు.