కలెక్టరేట్ లో అంబరాన్నంటిన బతుకమ్మ సంబురాలు
పాల్గొన్న ఎమ్మెల్యేలు, కలెక్టర్, సీ.పీ నిజామాబాద్, బతుకమ్మ : సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో బతుకమ్మ సంబురాలు అంబరాన్ని అంటాయి. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో జిల్లా స్థాయిలో నిర్వహించిన ఈ వేడుకకు అట్టహాసపు ఏర్పాట్లు చేశారు. శాసన సభ్యులు డాక్టర్ ఆర్. భూపతి రెడ్డి, దన్పాల్ సూర్యనారాయణ, కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి, పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, ట్రైనీ కలెక్టర్ కరోలిన్ చింగ్తియాన్ మావీ, నిజామాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్...